పాఠశాల సౌకర్యాలు కల్పించడంలో, అందుబాటును విస్తృతం చేయడంలో మరియు పాఠశాలల్లో పిల్లలను నిలుపుకోవడంలో భారతదేశం గొప్ప ప్రగతి సాధించింది. ఏదేమైనా, ఈ ప్రయత్నాలు అభ్యసన ఫలితాలలో మెరుగుదలకు దోహదపడలేదు.  విద్యార్థుల అభ్యసనం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అధిక అసమానతలు ఉన్నాయి. అందువల్ల మనం చేపట్టిన చర్యల వలన అందరి దృష్టి విద్యను అందివ్వడం నుండి అభ్యసనం వైపు మరల్చడం జరిగింది. వనరులు ఒకేలాగా ఉన్న పాఠశాలలు కూడా భిన్న అభ్యసన ఫలితాలను ఇస్తాయని గమనించవచ్చు.  లోపించిందేమిటంటే, పాఠశాలల సమర్థవంతమైన నిర్వహణ, ఫలితంగా తక్కువ స్థాయిలో అభ్యసన ఫలితాలు మరియు పాఠశాల నాణ్యత తక్కువగా ఉంటుంది.

సమర్థవంతమైన పాఠశాల నాయకత్వం వనరుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.  బోధనానాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు అభ్యాసకుల ప్రగతిని మెరుగుపరుస్తుంది. MHRD యొక్కసూచనతో, NIEPA నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్షిప్ (NCSL) ను ఏర్పాటు చేసింది: ప్రతి పాఠశాల రాణిస్తుంది మరియు ప్రతిబిడ్డ నేర్చుకుంటుంది’. భారతదేశంలో కొత్త తరం పాఠశాల నాయకులను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఒక చట్రం మరియు స్కూల్ లీడర్షిప్ (SLD) కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. SLD కార్యక్రమమం యోచన అనుగునంగా పాఠశాలల అధిపతులు తమ పాఠశాలలను 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'గా మార్చడానికి సహాయపడతాయని భావించడం జరిగింది.

ఐదేళ్ల స్వల్ప వ్యవధిలో, పాఠశాల విద్య యొక్క అన్ని స్థాయిల పాఠశాల అధిపతుల కొరకు ప్రత్యేకమైన ముఖాముఖి (SLD) కార్యక్రమాలను కేంద్రం రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. దేశంలోని ప్రతి పాఠశాలకు తన పరిధిని విస్తరించడానికి స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్ మెంట్ ఆన్లైన్-ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయడంలో కూడా కేంద్రం విజయవంతమైంది. ఆన్లైన్-ప్రోగ్రామ్ MOODLE ప్లాట్ఫాం ద్వారా పని చేస్తుంది మరియు స్కూల్ లీడర్షిప్ డెవలప్ మెంట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కోర్సు నాలుగు విభాగాలుగా రూపొందించబడింది.

(i) రీడింగ్ మెటీరియల్ లేదా మాడ్యూల్ రూపంలో ఇ-కంటెంట్ 

(ii) పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కేస్ స్టడీలు, ఆడియోలు, వీడియోలు మరియు అనేక ఇతర వనరులతో కూడిన రిఫరెన్స్ రీడింగ్ మెటీరియల్ 

(iii) స్వీయ అభ్యాస సామగ్రి మరియు కృత్యాలు; మరియు 

(iv) బహుళైచ్ఛిక ప్రశ్నలు, నియోజనములు, చర్చావేదికలు మరియు పొర్టుఫోలియోలు ద్వారా అంచనా వేయడం.

సంస్థాగత పనితీరును మెరుగుపరచడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) యొక్క చట్రంలోనే వారి పాఠశాలలను అభ్యాస కేంద్రంగా మరియు శ్రేష్ఠంగా మార్చడానికి వారి ప్రయత్నాలలో పాఠశాల అధిపతులకు మార్గనిర్దేశం చేయడానికి సమర్థవంతమైన SLD ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయడంలో ప్రధానమైన చొరవ తీసుకున్నందుకు మరియు వారు చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలకు గాను వారిని అభినందిస్తున్నాను.

- డాక్టర్ ఎన్.వి. వర్గీస్