NIEPA వద్ద 2012లో స్థాపించబడిన నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్షిప్(NCSL) దేశంలోని పాఠశాలలో పరివర్తనకు కట్టుబడి ఉంది. పాఠశాలలోని ప్రధాన లక్ష్యంగా మార్చడంతో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు,679 జిల్లాలు మరియు దేశవ్యాప్తంగా 6500 బ్లాకులలో నాయకత్వ అవసరాలు మరియు పాఠశాలకు చెందిన ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. ప్రధానంగా ఈ కేంద్రం యొక్క అన్ని కార్యకలాపాలు ప్రతి రాష్ట్రం/యూటీ లోని ప్రతి పాఠశాల కోసం మార్పు లక్ష్యంగా ఎజెండాను రూపొందించడంపై దృష్టి పెడుతుంది. పలురకాలైన పనిచేయగల నాయకత్వ నమూనాల అభివృద్ధికి ఈకేంద్రం దృష్టి పెడుతుంది
దేశంలోని ప్రతి పాఠశాలకు చేరుకోవడం, ప్రతి బిడ్డ నేర్చుకునేలా మరియు ప్రతి పాఠశాల రాణించేలా చేయడం NCSL యొక్క నినాదం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరియు మెటీరియల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, నెట్వర్కింగ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నాలుగు అంశాలతోపాటు కార్యకలాపాల ద్వారా పాఠశాల నాయకత్వం అభివృద్ధిని కేంద్రం భావించింది.
పాఠశాల నాయకత్వంపై సాధారణ స్వల్పకాలిక కార్యక్రమాల మాదిరిగా కాకుండా, పాఠశాల నాయకులు మరియు సంస్థాపక నిర్వాహకుల నిరంతర కార్యసాధన మరియు దీర్ఘకాలిక అభివృద్ధిని నిర్ధారించే నాయకత్వం అభివృద్ధి కార్యకలాపాలను కేంద్రం రూపొందించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాఠశాల నాయకత్వ అభివృద్ధి పై జాతీయ కార్యక్రమ రూపకల్పన మరియు పాఠ్య ప్రణాళిక ముసాయిదా జాతీయస్థాయిలో విషయీకరణ చేయబడింది. మొత్తం కార్యక్రమం ప్రాక్టీషనర్ సెంట్రిక్ పాఠ్యాంశాలపై ఆధారపడింది. ఇది రాష్ట్రాల్లోని పాఠశాలల అవసరాలు మరియు ప్రత్యేక సమస్యలు దానిలోని వైవిధ్యాలపై ఆధారపడి ఉంటుంది. కరికులంచట్రంలోపాఠశాల నాయకత్వ అభివృద్ధిపై ఒక కరదీపిక రూపొందించబడింది. ఈ కరదీపిక ఒక శ్రేష్ఠమైన మరియు ప్రస్తుత పాఠశాలల అధిపతులను నేటి పాఠశాలలను మార్చడానికి మరియు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి, వరుసగా రాబోయే నాయకులను సిద్ధం చేయడానికి రూపొందించబడిన ఒక రిఫరెన్స్ మెటీరియల్.