స్థాపించబడిన రోజు నుండే, NIEPA లోని నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్షిప్ పాఠశాల అధిపతుల నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడానికి కట్టుబడి ఉంది, “ఇవి నా బలాలు”, “ఇది నా పాఠశాల”మరియు “నా పాఠశాలను మార్చడానికి, పరివర్తన చేయడానికి నేను చేయవలసిన పని ఇది ”. ఈ రోజు మనం NCSL, NIEPA చేత పాఠశాల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం ఈ దేశం అంతటా అమలు చేయబడిందని గర్వంగా ప్రకటించగలిగే దశకు చేరుకున్నాము. ఈ ప్రయత్నంలో, మన రాష్ట్ర / యుటి ప్రభుత్వాల సహకార ప్రయత్నాలు ఎంతో ప్రశంసించబడ్డాయి. మన పాఠశాల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలతో దగ్గరి సంబంధం ఉన్న State Resource Group Members మరియు పాఠశాల అధిపతులు చూపిన కార్యక్రమం పట్ల ఉత్సాహం అసామానమైనది.
కేంద్రం ప్రారంభించిన పాఠశాల నాయకత్వ అభివృద్ధిపై అనేక కార్యక్రమాలలో, పాఠశాల నాయకత్వం మరియు నిర్వహణపై ఆన్లైన్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో పాఠశాల నాయకత్వ అభివృద్ధి పాఠ్యప్రణాళికపై ఆధారపడింది. అయితే, పాఠశాల వాస్తవ పరిస్థితులు, వివిధ సందర్బాలు, నాయకత్వ సమస్యలతో వ్యవహరిస్తుంది. ఇది ప్రధానంగా “వృత్తి కేంద్రీకృత” (practioner centric) విధానాన్ని అనుసరిస్తుంది. పరివర్తన మరియు మెరుగుదల కోసం ప్రధాన చోదకుడుగా పాఠశాల అధిపతి నాయకత్వ పాత్రను కేంద్ర స్థానంలోకి తీసుకువస్తుంది. అందువల్ల ఇది ప్రాథమిక, మాధ్యమిక మరియు సీనియర్ మాధ్యమిక పాఠశాలల అధిపతులు మరియు ప్రిన్సిపాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం స్వీయ-అభివృద్ధి నుండి పాఠశాల ఆధారిత మార్పులు మరియు ఆవిష్కరణలను ప్రారంభించడం మరియు కొనసాగించడం వరకు అనేక రకాల సంస్కరణ కార్యక్రమాలను అందిస్తుంది.
MHRD ఆదేశాల మేరకు MOODLE ప్లాట్ఫామ్ ఉపయోగించి ఆన్లైన్ ప్రోగ్రామ్ యొక్క అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించే సవాలును NCSL తీసుకుంది. మాలో “అవును మేము చేయగలము”అనే విశ్వాస స్ఫూర్తిని కలిగించినందుకు MHRD కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా NCSL లోని ప్రతి సభ్యుడు రిఫరెన్స్ రీడింగ్ మెటీరియల్ మరియు అభ్యాసాలు, మదింపు మరియు అసైన్మెంట్స్, ఆడియో-వీడియో లింక్లు మొదలైన వాటిని రూపొందించడం ద్వారా ఇ-కంటెంట్ రూపకల్పన, ఉత్పత్తి, సేకరణ, ఏకీకృతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. మా వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.వి.వర్గీస్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చిన NCSL, NIEPA మరియు మా విశ్వవిద్యాలయ సాంకేతిక నిపుణుల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
NCSL, NIEPA పాఠశాల అధిపతులకు చివరి మైలు చేరుకోవడంలో సహాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిలు మరియు రాష్ట్ర వనరుల సమూహాల సహకారం కోసం ఎదురుచూస్తోంది. ఈ దేశంలో ప్రతి పాఠశాల అధిపతిని ఈఅద్భుతమైన కార్యక్రమం నుండి గరిష్ట ప్రయోజనం పొందుతూ పాఠశాల మార్పు మరియు అభివృద్ధికి ఉత్ప్రేరకంగా మారగలరని ఆకాంక్షిస్తున్నాయి.
ప్రతి బిడ్డ నేర్చుకుంటుంది మరియు ప్రతి పాఠశాల రాణిస్తుంది”అని నిజం చేయడానికి పాఠశాల పరివర్తన యొక్క ఈ ప్రయాణంలో మనం కలిసి వెళ్దాం.
- ప్రొఫెసర్ రష్మదివాన్